నేనొక పవనాన్ని - కవిత
నేనొక పవనాన్ని … పీడన ప్రవణతను బట్టి ప్రయాణాన్ని సాగిస్తా చల్లని గాలులతో సేద తీరుస్తా పైరగాలితో పరవశింపజేస్తా ఫోన్ - చినూక్ లా వచ్చి వేడిని రగిలిస్తా బొరా - మిస్ట్రాల్ లా చల్లని గాలులతో వణికిస్తా గర్జించే నలుభైలా గడగడలాడిస్తా.. ఆక్సీజన్ లా మారి జీవజాతికి ఆయువునే అవుతా... నేనొక * మేఘాన్ని * ... ఆకాశ మార్గాన పయనిస్తా చల్లటి నీడను అందిస్తా, ఎత్తైన సిర్రస్ మేఘాలుగా మారి తెల్లని వెండి వెన్నెలను గుర్తుకు తెస్తా... స్ట్రాటస్, సిర్రస్ క్యుములస్ లక్షణాలనే పుణికిపుచ్చుకుంటా... క్యుములోనింబస్ లా చీకటితో కమ్మేస్తా మెరుపులనే మెరిపిస్తా ఉరుములతో ఊరికిస్తా పిడుగులతో భయపెడతా ... పుడమిని పులకింపజేస్తా... నేనొక * అవపాతాన్ని * ... అవసరానికి తగినట్లుగా రూపాన్ని మార్చుకుంటా హిమపాతంలా వస్తా చిరుజల్లులతో మురిపిస్తా సంవాహన వర్షంలా జోరువానలతో విజృంభిస్తా వడగండ్లతో విరుచుకుపడతా పర్వతీయ వర్షంలా పవనాభిముఖంలో కుంబవర్షంలా కురుస్తా... జీవజాతికి ప్రాణాధార...