అంతర్జాతీయ కూమార్తెల దినోత్సవం సందర్భంగా...


నాన్న వేలిని పట్టుకుని నడిచిన
ఆ చిన్నారి అడుగులే…
రేపు తన దారిని తానే ఎంచుకునే
ఆత్మవిశ్వాసపు అడుగులు...

అమ్మ ఒడిలో నేర్చుకున్న మమతను
హృదయంలో దాచుకుని,
జీవితం విసిరే సవాళ్లను
ధైర్యంగా ఎదుర్కొనే
మనసు ఆమెది..

“అమ్మాయి కదా…” అంటూ
ఎవరైనా గీసిన గీతల మధ్య
ఆమె ఆగిపోదు…
“నేను సాధించగలను” అంటూ
తన హద్దులను తానే చెరిపేస్తుంది. 

ఓటమి ఆమెకు ముగింపు కాదు…
అది మరో ప్రయత్నానికి
మొదటి మెట్టు. 

పెళ్లితో చిరునామా మారినా
పుట్టింటి జ్ఞాపకాలు మారవు…
దూరం పెరిగినా
అమ్మానాన్నలపై ప్రేమ తగ్గదు. 

కుమార్తెను గాజు బొమ్మలా
కాపాడటమే కాదు…
తన నిర్ణయాలు తానే తీసుకునే
స్వేచ్ఛను, ధైర్యాన్ని ఇవ్వాలి.

ఆమెకు 
ఆస్తికంటే - ఆత్మవిశ్వాసం,
అండకంటే - అవకాశం,
భద్రతకంటే - స్వతంత్రంగా నిలబడే శక్తి అందించాలి.

కుమార్తె ఒక బాధ్యత కాదు…
ఒక కుటుంబానికి గర్వకారణం.

ఆమె విజయం ఆమెకే కాదు…
ఆమెను నమ్మిన ప్రతి హృదయానికీ విజయం.

ప్రతి కుమార్తె తన కలలను నమ్మాలి…
తన శక్తిని గుర్తించాలి…
తన ఆకాశాన్ని తానే నిర్మించుకోవాలి!

అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలతో....

Comments

Popular posts from this blog

ఓటు హక్కు ప్రాధాన్యత