Posts

నేనొక పవనాన్ని - కవిత

నేనొక పవనాన్ని … పీడన ప్రవణతను బట్టి ప్రయాణాన్ని సాగిస్తా  చల్లని గాలులతో సేద తీరుస్తా   పైరగాలితో పరవశింపజేస్తా   ఫోన్ - చినూక్ లా వచ్చి వేడిని రగిలిస్తా  బొరా - మిస్ట్రాల్ లా చల్లని గాలులతో వణికిస్తా  గర్జించే నలుభైలా గడగడలాడిస్తా..  ఆక్సీజన్ లా మారి జీవజాతికి ఆయువునే అవుతా...   నేనొక * మేఘాన్ని * ... ఆకాశ మార్గాన పయనిస్తా చల్లటి నీడను అందిస్తా,  ఎత్తైన సిర్రస్ మేఘాలుగా మారి తెల్లని వెండి వెన్నెలను గుర్తుకు తెస్తా... స్ట్రాటస్, సిర్రస్ క్యుములస్  లక్షణాలనే పుణికిపుచ్చుకుంటా... క్యుములోనింబస్ లా చీకటితో కమ్మేస్తా  మెరుపులనే మెరిపిస్తా ఉరుములతో ఊరికిస్తా  పిడుగులతో భయపెడతా ...  పుడమిని పులకింపజేస్తా...   నేనొక * అవపాతాన్ని * ... అవసరానికి తగినట్లుగా రూపాన్ని మార్చుకుంటా హిమపాతంలా వస్తా  చిరుజల్లులతో మురిపిస్తా సంవాహన వర్షంలా జోరువానలతో విజృంభిస్తా వడగండ్లతో విరుచుకుపడతా  పర్వతీయ వర్షంలా పవనాభిముఖంలో కుంబవర్షంలా కురుస్తా... జీవజాతికి ప్రాణాధార...

ప్రశ్న - కవిత

ప్రశ్న ఆదిమానవుని ఆధునిక మానవునిగా మార్చింది. ప్రశ్న సోక్రటీస్ ను భువిపై  తొలి మేధావిగా నిలిపింది. ప్రశ్న పురోగమనానికి తొలి అడుగు, ప్రశ్న విజ్ఞాన వెలుగుల భానుడు   ప్రశ్నలే మేధస్సుకు మేత, మనిషి ఎదుగుదలకు  శ్వాస. ప్రశ్నలేని జీవితం మూసిన పుస్తకం, ప్రశ్నలతో కూడిన జీవితం అపరిమిత అధ్యాయాల నిలయం   గతాన్ని ప్రశ్నిస్తే చరిత్ర మాట్లాడుతుంది, వర్తమానాన్ని ప్రశ్నిస్తే వాస్తవం బయటపడుతుంది, భవిష్యత్తును ప్రశ్నిస్తే ఆశల ఆశయాల  దారవుతుంది  ప్రశ్నించనందుకే మధ్యయుగం  అంధకారమైంది ఎందుకు ? ఏమిటి? ఎలా ? అనే ప్రశ్నలే ఆధునిక ఆరంభానికి, అభివృధ్దికి ఆధారమైనాయి.   ప్రశ్న  చినుకై జ్ఞాన నదిగా మారుతుంది ఆ నది  నాగరికతనుండి  మహాసముద్రం అవుతుంది ఆ మహాసముద్రమే మరో చినుకుకుఆధారమవుతుంది. ఆ చినుకు నవ నాగరికతకు  నాంది అవుతుంది    ప్రశ్నించడం మనిషికే సాధ్యం అందుకే… భయపడకుండా ప్రశ్నించు, భాధ్యతగా ప్రశ్నించు,  మంచి భవితకై ప్రశ్నించు, ప్రతి ప్రశ్నతో కొత్త ప్రపంచం ఆవిష్కరించు ప్రశ్న ...

ఉత్తరానికో ఉత్తరం

ప్రపంచ తపాలా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న జరుగుతుంది... స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపించబడింది. UPU వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ తపాలా దినోత్సవం జరుపు కుంటారు...                                 ఈ సందర్భంగా. .. తపాలా అంటే గుర్తుకు వచ్చే ఉత్తరానికో ఉత్తరం ... పూజ్యులైన ఉత్తరం గారికి నమస్కారములతో , ఉభయకుశలోపరి .... ఇంతకూ ,   ఉత్తరమా .. ఉత్తరమా ...   నీ ఆచూకీ ఎక్కడమ్మా ? ఉత్తరం అనే మూడక్షరాలు నేడు కళ తప్పిపోయాయి కావచ్చు . మన్నించు నేస్తమా .. నీ గొప్ప తనాన్ని తగ్గించి తప్పుచేసింది మేమేకదా ... ఆధునిక యాంత్రిక యుగంలో ప్రవేశించి నీ ఆనవాళ్ళను చిదిమేశాము . ఎన్ని సంవత్సరాలుగా నీతో అనుబంధం పెంచుకున్నాం . నీతో ఎన్ని మధుర ఙ్ఞాపకాలను పంచుకున్నాం. ఆ ఙ్ఞాపకాలను ఇరవై ఒకటవ శతాబ్దంలో పూర్తిగా అటకెక్కించాం . ఊహ తెలిసిన కొత్తలో  మూ...

సాంకేతికత గురువుకు ప్రత్యామ్నాయం కాదు

సాంకేతికత సమాచారాన్ని అందించగలదు…  కానీ మనిషిని తీర్చిదిద్దలేదు! కాలం మారుతోంది. విద్యా ప్రపంచం శరవేగంగా మారుతోంది. ఒకప్పుడు నల్లబల్ల, సుద్దముక్క, పాఠ్యపుస్తకం చుట్టూ తిరిగిన తరగతి గది.. నేడు డిజిటల్‌ బోర్డులు, స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు, ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ వనరులు, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. విద్యార్థి చేతిలో ఇప్పుడు ప్రపంచమే ఉంది. ఒక మొబైల్‌ ఫోన్‌తో ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న సమాచారాన్నైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. వీడియోల ద్వారా నేర్చుకోవచ్చు. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావచ్చు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ఇంతటి సాంకేతిక విప్లవం జరుగుతున్న సమయంలో సహజంగానే ఒక ప్రశ్న ఎదురవుతోంది . ఇక గురువు అవసరం ఏమిటి?   సాంకేతికత అన్నీ చేయగలిగినప్పుడు గురువు పాత్ర తగ్గిపోతుందా? సమాధానం ఒక్కటే సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. అది గురువుకు ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే సాంకేతికత సమాచారాన్ని అందించగలదు. గురువు మాత్రం ఆ సమాచారాన్ని జ్ఞానంగా, జ్ఞానాన్ని వివేకంగా మార్చే శక్తిని విద్యార్థిలో పెంచుతాడు. సమాచారం ...

భూమాతకు లేఖ– ప్రకృతిని కాపాడేందుకు నా హామీ

ప్రియమైన భూమాతకు, అమ్మా! నువ్వు కేవలం మేము నివసించే నేలవు కాదు; మా జీవనానికి ఆధారమైన తల్లివి. నీ ఒడిలోనే మేము పుడుతున్నాం, నీ నీటిని తాగుతున్నాం, నీ నేల పండించిన ఆహారాన్ని తింటున్నాం, నీ గాలిని పీలుస్తున్నాం. అయినా నీకు రక్షణగా నిలవాల్సిన మనిషే నీ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ఒకప్పుడు పచ్చని అడవులు, స్వచ్ఛమైన నదులు, నిండైన చెరువులు, పక్షుల కిలకిలారావాలతో నువ్వు ఎంతో అందంగా ఉండేవి. కానీ అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, వాయు కాలుష్యం, ప్రకృతి వనరుల దుర్వినియోగం పెరిగిపోయాయి. దాని ఫలితంగా వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, కరువులు, వరదలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అమ్మా! నీకు జరిగిన నష్టానికి నేను క్షమాపణ కోరుతున్నాను. అయితే క్షమాపణతో ఆగకుండా, నా వంతు బాధ్యతను నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాను. నీ కోసం నేను కొన్ని హామీలు ఇస్తున్నాను. ముందుగా, చెట్లను కాపాడుతూ, అవసరమైన చోట మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తాను. చెట్లు కేవలం మనకు నీడను ఇవ్వడమే కాదు, గాలిని శుద్ధి చేసి జీవులకు ఆశ్రయాన్ని అందిస్తాయని గుర్తుంచుకుంటాను. నీటిని వృథా చేయను. కు...

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శాంతినగర్, ఖమ్మం

శతాబ్ద ప్రస్థానం – కాలంతో పాటు మారుతూ… తరాలను తీర్చిదిద్దుతూ… ఖమ్మం నగర విద్యా చరిత్రలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శాంతినగర్ ఒక ప్రత్యేకమైన అధ్యాయం. 1927లో ప్రారంభమైన ఈ విద్యాలయం , దాదాపు శతాబ్ద కాలంలో అనేక చారిత్రక, విద్యా, సామాజిక మార్పులకు సాక్షిగా నిలిచింది. ఒకప్పుడు ఉర్దూ మాధ్యమ బాలుర పాఠశాలగా ప్రారంభమైన ఈ విద్యాలయం, కాలక్రమంలో తెలుగు మాధ్యమం, మల్టీపర్పస్ విద్య, HSC–PUC, TTC, జూనియర్ కళాశాల, కో-ఎడ్యుకేషన్, ఇంగ్లీషు మాధ్యమం వంటి అనేక దశలను దాటి నేడు ఆధునిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా నిలిచింది. 1927 – ఆవిర్భావం నాటి నిజాం   మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనలో 1927లో ఈ పాఠశాల ఖమ్మంలోని అప్పటి పాత జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ప్రస్తుత ఖాజీపుర పాఠశాల ప్రాంగణంలో ఉర్దూ మాధ్యమ బాలుర పాఠశాలగా ప్రారంభమైంది. ఆ కాలంలో విద్యావకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ, ఖమ్మం ప్రాంత విద్యార్థులకు విద్యను అందించే ఒక ముఖ్యమైన కేంద్రంగా ఈ పాఠశాల తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 1950 – తెలుగు మాధ్యమంలోకి మార్పు 1950 సంవత్సరం నుండి పాఠశాల తెలుగు మాధ్యమంలో కొనసాగింది. ఈ దశలో ఇది మల్టీపర్పస్ స్కూల్‌గా...

నేనొక ఉపాధ్యాయుడిని… నా లక్ష్యం ఇదే - చల్లగాని కృపాబాలానందం

ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శాంతినగర్, ఖమ్మం కొన్ని పాఠశాలలు మనకు విద్యను అందిస్తాయి… కొన్ని పాఠశాలలు మన జీవితాన్ని నిర్మిస్తాయి… మరికొన్ని పాఠశాలలు మనల్ని మళ్లీ తమ ఒడిలోకి పిలుచుకుంటాయి. నా జీవితంలో శాంతినగర్ పాఠశాల అలాంటి పాఠశాల. ఒకప్పుడు ఈ పాఠశాల గుమ్మం దాటి విద్యార్థిగా లోపలికి అడుగుపెట్టాను. తరగతి గదుల్లో కూర్చున్నాను. గురువుల మాటలు విన్నాను. కలలు కన్నాను. అప్పుడు ఊహించలేదు— ఒకరోజు నేనే ఉపాధ్యాయుడిగా మారి, ఎన్నో పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు బోధించి, చివరకు నన్ను తీర్చిదిద్దిన అదే పాఠశాలకు తిరిగి వచ్చి, ప్రధానోపాధ్యాయుడిగా నిలబడతానని. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, అది కేవలం ఉద్యోగ ప్రస్థానం కాదు. అది ఒక ఉపాధ్యాయుడి ప్రయాణం. అది అనుభవాల ప్రయాణం. అది అన్వేషణ. అది పోరాటం. అది సంతృప్తి. అన్నింటికంటే మించి— విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలనే నిరంతర తపన.   మొదటి అడుగు… చుంచుపల్లి నా ఉపాధ్యాయ జీవితానికి అధికారికంగా తొలి అధ్యాయం 09.08.1999న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చుంచుపల్లి, కొత్తగూడెం లో ప్రారంభమైంది. స్కూల్ ...