నేనొక పవనాన్ని - కవిత
నేనొక
పవనాన్ని…
పీడన ప్రవణతను బట్టి ప్రయాణాన్ని
సాగిస్తా
చల్లని గాలులతో సేద తీరుస్తా
పైరగాలితో పరవశింపజేస్తా
ఫోన్ - చినూక్ లా వచ్చి వేడిని
రగిలిస్తా
బొరా - మిస్ట్రాల్ లా చల్లని గాలులతో
వణికిస్తా
గర్జించే నలుభైలా గడగడలాడిస్తా..
ఆక్సీజన్ లా మారి జీవజాతికి ఆయువునే
అవుతా...
నేనొక *మేఘాన్ని* ...
ఆకాశ మార్గాన పయనిస్తా
చల్లటి నీడను అందిస్తా,
ఎత్తైన సిర్రస్ మేఘాలుగా మారి
తెల్లని వెండి వెన్నెలను గుర్తుకు
తెస్తా...
స్ట్రాటస్, సిర్రస్ క్యుములస్
లక్షణాలనే పుణికిపుచ్చుకుంటా...
క్యుములోనింబస్ లా చీకటితో
కమ్మేస్తా
మెరుపులనే మెరిపిస్తా
ఉరుములతో ఊరికిస్తా
పిడుగులతో భయపెడతా ...
పుడమిని పులకింపజేస్తా...
నేనొక *అవపాతాన్ని* ...
అవసరానికి తగినట్లుగా రూపాన్ని
మార్చుకుంటా
హిమపాతంలా వస్తా
చిరుజల్లులతో మురిపిస్తా
సంవాహన వర్షంలా
జోరువానలతో విజృంభిస్తా
వడగండ్లతో విరుచుకుపడతా
పర్వతీయ వర్షంలా పవనాభిముఖంలో
కుంబవర్షంలా కురుస్తా...
జీవజాతికి ప్రాణాధారమౌతా...
పర్వతాలకు మరోవైపు కరువులతో అల్లాడిస్తా
ఎడారులను సృష్టిస్తా...
నేనొక *నదిని* ...
పర్వతాలపైనే పురుడుపోసుకుంటా...
గిరులపై గెంతుతూ పరుగెడతా..
V. ఆకారపు లోయలనే ఏర్పరుస్తుంటా...
మృత్తికాక్రమక్షయాన్ని చేసుకుపోతా...
సెలయేరులను, నీటిపాయలను నాలో
కలిపేసుకుంటా...
ప్రకృతి అందాలతో కనువిందుచేస్తా...
పీఠభూమి ప్రాంతంలో నిండైన నీటితో
గుంభనంగా ప్రవహిస్తా
ప్రక్క కోతలతో విశాలంగా మారుతా...
మైదానప్రాంతంలో అడుగిడి అవసానదశకు
చేరుకొని చీలికలుగా మారుతా డెల్టాలను ఏర్పరుస్తా...
ఓండలి మేటలు వేస్తా...
పుడమిని సారవంతంగా మార్చి అధిక దిగుబడి
అందేలా చేస్తా
రైతుల మోమున చిరునవ్వులు చిందిస్తా...
కాలాన్ని బట్టి కదులుతూ ఉంటా
వానాకాలంలో వరదల్లే ప్రవహిస్తా
వేసవికాలంలో నాజూకుగా సన్నబడిపోతా
నడుము వంకరలతో హొయలేపోతా
ఆక్స్ బౌ సరస్సులనే సృష్టిస్తా...
అందమైన తీరాలతో మైమరపిస్తా...
నేనొక *సముద్రాన్ని* ...
సూర్యాతాపానికి లోనై ఆవిరిలా మారుతా...
అంబరాన్ని చుంభించి మేఘంలా మారుతా
వర్షపాతానికి నేను ఆధారన్నౌతా....
నదులకు నేను ప్రాణాధారమౌతా...
నదులన్నింటిని నాలో కలిపేసుకుంటా...
తరంగాలకు, పోటు పాటులకు సాక్షంగా
నిలుస్తా...
అల్పపీడనాలకు,చక్రవాతాలకు బాసటగా
నిలుస్తా...
తుఫానులంటూ, టైపూన్ లు టోర్నడోలు,
హరికేన్ ల పేరుతోవస్తుంటా,
అగ్నిపర్వతాలు భూకంపాలతో అపుడపుడు
త్సునామీలతో భయపెడతా...
తీరప్రాంతాలతో ప్రకృతి రమణీయతకు సాక్షంగా
నిలుస్తా...
రుచికరమైన మత్స్య సంపదకు నిలయమౌతా...
బెత్సవారలకు నేను జీవనాధారాన్నవుతా...
ప్రపంచ వాణిజ్యానికి అనుసంధానంగా ఉంటా...
దేశాభివృద్ధికి బాసటగా నిలుస్తా...
ఖనిజవనరులను అందించి దేశ ప్రగతికి
ఇంధనంగా మారుతా...
నేనొక *సాంఘికశాస్త్ర
ఉపాధ్యాయుడిని...*
తరగతిలో విద్యార్ధులకు పరిసరాలు
పర్యావరణం, సమాజంపై అవగాహన కల్పిస్తా...
విద్యార్ధులను సాంఘికీకరణ చేస్తూ
ప్రపంచాన్ని పరిచయం చేస్తా...
ప్రపంచాన్ని విద్యార్ధుల ముందు
ఆవిష్కరిస్తా...
భౌగోళిక స్వరూపాలను అవగతం అయ్యేలా
చేస్తా...
భూభ్రమణం భూపరిభ్రమణాలతో పగలు రాత్రుల
ఏర్పాటు విధానాన్ని అవగాహన చేస్తా
ఋతువుల మార్పులను గుర్తించేలా చేస్తా
అక్షాంశ రేఖాంశాలను కాలమానాలను
శీతోష్ణస్థితి మండలాలను వాటిమధ్య భేధాలను గుర్తించేలా చేస్తా...
చారిత్రక అంశాలను సులువుగా చెబుతుంటా...
రాజుల పాలనను సాంస్కృతిక వారసత్వాన్ని
పరిచయం చేస్తా...
పౌరుల హక్కులు, విధులు గుర్తుకు
తెస్తుంటా
రాజ్యాంగ సూత్రాలను గౌరవించేలా
చేస్తా
మాక్ ఎన్నికలు, మాక్ అసెంబ్లీ, మాక్
పార్లమెంట్ ల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్త పనితీరును పరిచయం చేస్తా
పాఠశాల కార్యక్రమాలలో పాల్గొనేలా
చేయుట ద్వారా ప్రభుత్వ పాలనలో భాగస్వాములను చేస్తా...
కుటుంబ బడ్జెట్ నుండి దేశ బడ్జెట్ వరకు
తరగతిలో ప్రదర్శించి ఆర్ధిక వ్యవస్థను, ఆర్ధిక కార్యకలాపాలను పరిచయం చేస్తా...
ఆర్ధిక సవాళ్ళపై అవగాహన
కల్పిస్తా..
సామాజిక సమస్యలపై చర్చింపజేస్తా...
మొత్తంగా విద్యార్ధులను ఉత్తమ భావి భారత
పౌరులుగా తీర్చిదిద్దుతా...
I am the *Wind* ...
- I travel based on pressure gradients, bringing cool
breezes and warmth.
- I soar high, making life vibrant, like the Chinook wind.
- I bring cold gusts like the Mistral, making the
environment shiver.
- I roar like the Roaring Forties, making the earth tremble.
- I become oxygen, giving life to living beings.
I am the Cloud...
- I travel through the sky, providing shade and bringing
life-giving rain.
- I transform into cirrus clouds, bringing a silver lining.
- I take on the characteristics of stratus and cumulus
clouds.
- I darken the sky like cumulonimbus clouds, bringing
lightning and thunder.
I am the *Precipitation...*
- I change my form according to need, bringing snow,
drizzle, or heavy rain.
- I pour down like a thunderstorm, bringing hail and
thunder.
- I become life-giving water, nourishing the earth.
- I create deserts and droughts on the other side of
mountains.
I am the *River* ...*
- I originate from mountains, flowing and carving V-shaped
valleys.
- I erode soil and carry sediments, creating scenic
landscapes.
- I flow majestically through plateaus and widen through
lateral erosion.
- I create deltas and oxbow lakes, making the land fertile.
Iam an *Ocean* ...
- I evaporate under the sun, forming clouds and bringing
rain.
- I be the lifeline for rivers, providing a habitat for
marine life.
- I be a witness to waves and tides, and a source of
minerals.
- I support global trade and commerce, providing a pathway
for economic growth.
I am the *Social
Science Teacher...*
I educate students about their surroundings, environment,
and society.
I socialize students, introducing them to the world and its
diverse cultures.
I explain geographical concepts, such as the Earth's
rotation and revolution, day and night, and seasonal changes. I teach students
about latitudes, longitudes, time zones, and climate zones.
I make history engaging, covering monarchies, cultural
heritage, and civic duties. I emphasize citizens' rights and responsibilities,
promoting respect for constitutional principles. Through mock elections,
assemblies, and parliaments, I introduce students to democratic processes.
By involving students in school activities, I empower them
to participate in governance. I explain economic concepts, from family budgets
to national budgets, and discuss economic challenges. I facilitate discussions
on social issues, shaping students into informed and responsible future
citizens of India.
Ch. Krupa
Balanandam H.M (FAC) &
TSSTF President. Kmm dist.
S.A (Social studies)
(Certified Textbook writer)
GHS Shanthinagar, Khammam
Comments
Post a Comment