ఉత్తరానికో ఉత్తరం
ప్రపంచ తపాలా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న జరుగుతుంది... స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపించబడింది. UPU వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ తపాలా దినోత్సవం జరుపు కుంటారు... ఈ సందర్భంగా. .. తపాలా అంటే గుర్తుకు వచ్చే ఉత్తరానికో ఉత్తరం ... పూజ్యులైన ఉత్తరం గారికి నమస్కారములతో , ఉభయకుశలోపరి .... ఇంతకూ , ఉత్తరమా .. ఉత్తరమా ... నీ ఆచూకీ ఎక్కడమ్మా ? ఉత్తరం అనే మూడక్షరాలు నేడు కళ తప్పిపోయాయి కావచ్చు . మన్నించు నేస్తమా .. నీ గొప్ప తనాన్ని తగ్గించి తప్పుచేసింది మేమేకదా ... ఆధునిక యాంత్రిక యుగంలో ప్రవేశించి నీ ఆనవాళ్ళను చిదిమేశాము . ఎన్ని సంవత్సరాలుగా నీతో అనుబంధం పెంచుకున్నాం . నీతో ఎన్ని మధుర ఙ్ఞాపకాలను పంచుకున్నాం. ఆ ఙ్ఞాపకాలను ఇరవై ఒకటవ శతాబ్దంలో పూర్తిగా అటకెక్కించాం . ఊహ తెలిసిన కొత్తలో ...