Posts

Showing posts from August, 2024

మిత్రులందరికీ 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...

Image
           మిత్రులందరికీ   భారత  78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .   మనదేశ ప్రజలంతా 7 8 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఇలా మీ ముందు కొన్ని విషయాలను పంచుకోవడం నాకు ఎనలేని ఆనందంగా ఉంది . ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ా స్వాతంత్ర్యాల కు దారితీసిన అసంఖ్యాక త్యాగాలను , పోరాటాలను మనం గుర్తించి గౌరవించాలి . ఎన్నో వైవిద్యతలు గల దేశ ప్రజలను ఒక తాటిపైకి తీసుకువచ్చి “ భిన్నత్వంలో ఏకత్వం ”   గల దేశంగా మార్చే క్రమంలో అమరులైన మహనీయులను , వారు పాటించిన   ఆదర్శవంతమైన విలువలను , వారు నమ్మిన ఆశయాలను గౌరవిస్తూ , దేశ స్వాతంత్ర్య సాధన కోసం   వారు చేసిన త్యాగాలను , వారి పోరాట స్పూర్తిని , వారి నిబద్ధత ను మననం చేసుకోవాల్సిన శుభదినం ఈరోజు .              సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా, మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి మన గత చరిత్రను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నేను తరగతి గదిలో పాఠ్యాంశాల రూపంలో గుర్తు చ...